సంతనూతలపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సురేష్ బాబు మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ... మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న సిసి రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు కూడా సక్రమంగా జరిగేలా చూడాలని, గ్రామాల్లో ఎక్కడ నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యటించి, వారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీవో సూచించారు.