అనంతపురంలో బుధవారం జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం మడకశిర పట్టణంలోని 20 వార్డుల నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తరలి వెళ్లారు. వీరందరినీ బస్సుల్లో ఎక్కించి మడకశిర మున్సిపల్ చైర్మన్ నరసింహ రాజు పంపించడం జరిగింది. ప్రతి బస్సులో ఒక ఏఎన్ఎం మెడికల్ కిట్ ను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ తెలిపారు.