బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్ష ప్రజలు స్వాగతిస్తున్నారని సిడీసీ మాజీ ఛైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం సదాశివపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లినప్పుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆమెకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఈ సస్పెన్షన్తో నిరూపితమైందని పేర్కొన్నారు.