రేషన్ డీలర్లకు గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న కమిషన్ను వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని రేషన్ డీలర్ల సంఘం కడెం మండలధ్యక్షులు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న కమిషన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మండల రేషన్ డీలర్లు సోమవారం తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసి ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడారు ప్రభుత్వం గత 5 నెలలుగ రేషన్ డీలర్లకు కమిషన్ విడుదల చేయకపోవడంతో రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందుల్లోకి కూడుకపోతున్నారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు డీలర్ల కమిషన్ వేర్వేరుగ కాకుండ పాత పద్ధతిలో డీలర్ల కమిషన్ ఒకేసారి విడుదల చేసి డీలర్ల ఖాతాలలో జమ అయ్యే విధంగా చూడాలన్నారు.