మాతా శిశు మరణాల నివారణపై దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. నాణ్యత కలిగిన పౌష్టికాహారాన్ని సకాలంలో సరఫరా చేయాలన్నారు. సోమవారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా సరఫరా చేసే వస్తువుల నాణ్యత పాటించాలని, సకాలంలో సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మాతా శిశు మరణాల నివారణపై దృష్టి సారించాలన్నారు.