రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులో లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు బుధవారం తరలించారు. గాయపడ్డ వ్యక్తులు కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన బెజ్జంకి మల్లేష్, బెజ్జంకి సురేష్ గా గుర్తించారు. బెజ్జంకి మల్లేష్ కు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.