అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటి మ్యాజిక్ డ్రైను చోడవరం నియోజకవర్గం పరిధిలో గల రావికమతం మండలం ధర్మవరంలో నిర్మిస్తున్నారు. డ్రైన్ నిర్మాణ పనులు ఎండీవో సీతారామస్వామి గురువారం ప్రారంభించారు. సీసీ డ్రైన్కు బదులుగా ఇకపై మ్యా జిక్ డ్రైన్ నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలతో పనులు చేపట్టారు. రూ.5.11 లక్షల ఉపాధి నిధులతో వెయ్యి మీటర్ల పొడవునా డ్రైన్లను ఈ గ్రామంలో నిర్మిస్తున్నామన్నారు. వాడుక నీరు ఈ డ్రైన్లో ఇంకిపోతుంది.