జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అనకాపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు, మంగళవారం నియోజవర్గం లోని గ్రామాలతో పాటు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు, అనంతరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.