అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం 11:30 నుంచి రెండు గంటల వరకు నిర్వహించిన జాతీయ అందుల ఈసీ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందజేస్తానని అందులో సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి తెలిపారు.