రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో డ్రైనేజీ,సిసి రోడ్ల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 11వ వార్డులో మురికి నీరు చేరి దుర్గంధం వెదజల్లుతోందని, దీనివల్ల విష జ్వరాలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.