కడప నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీ కరెస్పాండంట్ రమణారెడ్డి ఆగడాలు మితి మీరాయని విద్యార్థి, ప్రజాసంఘాలు ఆరోపించాయి. కడప ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థి సర్టిఫికెట్లు ఇవ్వకుండా బూతులు తిట్టి, దాడికి పాల్పడ్డాడని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్ధినికి సర్టిఫికెట్లు ఇవ్వాలని, లేని పక్షంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.