రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, రైతులకు యూరియా కొరత రాకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా లభ్యత ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.