వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి జిల్లా చోడవరం శ్రీ స్వయంభు విఘ్నేశ్వర స్వామి ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడుతుంది. వర్షం తెరిపి ఇవ్వడంతో భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసాయి. దర్శనానికి సుమారుగా అరగంట సమయం పడుతుంది. వచ్చే నెల 4వ తేదీ వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు అర్చకుడు చలపతి తెలిపారు.