కడప నగరంలో సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జొమాటో డెలివరీ బాయ్స్ కు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎ.మధు మల్లేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ – ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు విస్తృతంగా జరుగుతున్నాయని, ముఖ్యంగా డెలివరీ బాయ్స్ వంటి యువతను లక్ష్యంగా చేసుకొని మోసగాళ్లు వివిధ రకాలుగా మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా UPI మోసాలు, ఫిషింగ్ లింకులు, నకిలీ కస్టమర్ కాల్స్, OTP షేరింగ్ మోసాలు వంటి అంశాలపై సైబర్ క్రైమ్ సి.ఐ వివరంగా అవగాహన కల్పించారు.