సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తిరిన రైతులను చూసి బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హారీశ్ రావు కాసేపు ఆగి రైతులతో మాట్లాడారు. ఈ మేరకు రైతులు ఉదయం 5 గంటల నుంచి ఇక్కడే ఉంటున్నామని., ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారని తెలిపారు. ఆధార్ కార్డు, ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నట్లు హరీశ్ రావుతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గోస లేదని.. కాంగ్రెస్ వచ్చాక నీళ్ళు లేవు, యూరియా లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు వేసుకువాలి.. ఎప్పుడు పంట పండాలి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో హ