రెంజల్ మండలంలోని తాడ బిలోలి గ్రామంలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పథకం కింద మంజూరైన పశువుల పాకలను డిఎల్పిఓ నాగరాజు, డిఈ వెంకటేశ్వరరావు, ఎంపిడిఓ కమలాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబిన్ ఖాన్ తో కలిసి భూమి పూజ చేశారు. అంతేగాక పనుల జాతరలో భాగంగా మండలంలోని కందకుర్తి, అంబేద్కర్ నగర్ గ్రామాలలో అంగన్వాడి నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.