కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రి వైద్యులపై ఎంఎల్ కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆస్పత్రి ప్రాంగణానికి ఆకస్మికంగా చేరుకున్న ఆయన ఆస్పత్రి వరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి ఆస్పత్రి నిర్వహణలోపంపై మండిపడ్డారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పలు మార్లు హెచ్చరించానని, వరిసరాల పరిశుభ్రత కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినప్పటికీ ఇలాంటి పద్దతుల్లో ఉండటం సరైంది కాదని అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు.