భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా మూసా పేట్ మండలం నిజాలా పూర్, మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంల ఆవరణలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ విజయేందిర పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయ్యి, వారు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి, అధికారులకు సూచనలు చేశారు. ఒకే దరఖాస్తులో రైతులు రెండు, మూడు రకాల భూ సమస్యలను పేర్కొనే సమయంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్