జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఈ నెల 24వ తేదీన కోర్టు భవనాన్ని ప్రారంభించనున్నట్లు మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, అడ్వకేట్ శ్రీధర్ రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు కోర్టు భవనం పరిసరాలను పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయమూర్తులు హాజరుకానున్నట్లు తెలిపారు. దీంతో సర్కిల్ పరిధిలోని జిన్నారం, బొల్లారం గుమ్మడిదల హత్నూర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.