Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దూరుపాడు నేషనల్ హైవే (nh 16)పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని రూరల్ సీఐ రాజేశ్వరరావు శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తెలిపారు. మృతుడి వివరాలు ఏమి తెలియవని చెప్పారు. మృతదేహాన్ని కావలి ఏరియా వైద్య శాలకు తరలించారు. వివరాలు తెలిసిన వారు రూరల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.