ఆసిఫ్నగర్ PS పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన హత్య కేసును ఆసిఫ్ నగర్ పోలీసులు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. మృతుడి స్నేహితులు మహమ్మద్ వాసిన్, సమీర్ ఖాన్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు మృతుడికి పాత కక్షలు ఉన్నాయని, అవి మనసులో పెట్టుకుని ప్రణాళిక రచించి 20వ తేదీన కత్తితో పొడిచి చంపినట్లు ఏసీపీ కిషన్ కుమార్ తెలిపారు.