గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని విజయ్ డిజిటల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న భార్యా భర్తలతో పాటు వారి బాబు కూడా గాయపడ్డారు. అంబులెన్స్ ఆలస్యం కావడంతో స్థానికులు ఆటోలో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.