Parvathipuram, Parvathipuram Manyam | Aug 22, 2025
జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కొళాయి కనెక్షన్లను ఏర్పాటు చేసినా, ఏడాదికాలంగా నీరు రావడంలేదని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోని పాచిపెంట మండలంలో ఉన్న మడవలస, తురాయిపాడు గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలో సిపిఎం నాయకుడు కోరాడ ఈశ్వరరావు తదితరులతో కలిసి తాగునీరు ఇవ్వని కొళాయిల వద్ద నిరసన తెలిపారు.