సత్యసాయి జిల్లా కనగనపల్లి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కనగానపల్లి అగ్రికల్చర్ కార్యాలయం నందు రైతులకు యూరియాని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కనగాలపల్లి అగ్రికల్చర్ మాధురి మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు కనగానపల్లి మండల రైతులుకు అవసరమైన ఎరువులు యూరియా వాటిని అగ్రికల్చర్ కార్యాలయంలో అవసరమైన రైతులకు అందిస్తున్నామని, కనగానపల్లి మండలంలో రైతులకు ఎరువులు కావాలంటే అగ్రికల్చర్ కార్యాలయం సంప్రదించి కొనుగోలు చేయవచ్చునని అగ్రికల్చర్ ఏవో మాధురి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు అగ్రికల్చర్ అధికారులు రైతులు పాల్గొన్నారు.