మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో సుమారు వందమంది (డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ) వారికి మద్యం సేవించడం వల్ల కలిగే అనర్ధాలు,రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు భద్రత నిబంధన ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తామని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు,టౌన్ ఎస్సై ఎల్లా గౌడ్,పోలీస్ సిబ్బంది ఉన్నారు.