అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలోని డెక్కన్ రెమెడీస్ ప్రైవేటు లిమిటెడ్ లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ కెమిస్ట్ ఎం.పోల్నాయుడు సోమవారం నాడు మృతి చెందారు.దీనిపై సమగ్ర విచారణ చేసి కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ఫార్మసిటి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ సోమవారం నాడు డిమాండ్ చేశారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.