రీ సర్వేలో తలెత్తిన సమస్యలపై జాయింట్ పట్టాదారులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు సెప్టెంబర్ 30వ తేదీ లోపు సచివాలయంలో తమ సమస్యల వినతిని 50 రూపాయల రుసుము చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విద్యా ధరి పేర్కొన్నారు గత గ్రామసభలో ఇచ్చిన సమస్యల పరిష్కారం కూడా 500 మందికి పరిష్కరించామని తెలిపారు ప్రభుత్వం గతంలో 500 రూపాయల రుసుము ఉండగా దానిని పూర్తిగా 50 రూపాయలకు పరిమితం చేసి వినతలను రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు