నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామ ప్రధాన రహదారిపై వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలను రూరల్ ఎస్ఐ రాముడు తన సిబ్బందితో కలిసి మోరం, మట్టి వేయించి పూడ్చివేశారు. వాహనదారులు, గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టారు.