ఇటీవల కురిసిన వర్షానికి గోస్తనీ నది నిండుకుండలా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి విజయనగరం జిల్లా జామి మండలంలోని తాండ్రంగిలో నదిపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో విద్యుత్ తీగలు నదిలో తెగిపడ్డాయి. చుట్టు పక్కల గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదన్న సంకల్పంతో లైన్ మెన్ వెంకటరావు తన సిబ్బందితో కలిసి పీకల్లోతు నీటిలో దిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.