ఒక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి శనివారం ఉదయం చేరుకొని పురోహితుల మంత్రోచ్చారణలు, పూర్ణకుంభంతో ఆశీర్వచనాలతో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గిరిజన అభివృద్ధితోపాటు జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పనకు తనవంతుగా కృషి చేస్తానన్నారు.