చిన్న శంకరంపేట మండలం లోని మడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు.గురువారం సహకార సంఘానికి ఒక యూరియా లారీ రావడంతో టోకెన్ల కోసం రైతులు ఎగబడ్డారు. మహిళలు, వికలాంగులు సైతం టోకెన్ల కోసం బారులు తీరారు. గత పది రోజులుగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని, తమకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. పంట పొలాలను వదిలేసి తాము యూరియా బస్తాల కోసం ఉదయం నుండి రాత్రి వరకు కార్యాలయాలు వద్ద పడిగా పలుకాస్తున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులు లేవన్నారు.