మీసేవ కేంద్రాల్లో అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ హెచ్చరించారు. నేడు బుధవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన వాజేడు, వెంకటాపురం మండలాల్లోని మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆపరేటర్లు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. అతి త్వరలో కొత్త ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.