బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన షంషీర్ పాషా అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.మహిముదబేగం ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..మధ్యకాలంలో పేకాటకు, బెట్టింగులకు అలవాటు పడి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.. సోమవారం భార్య మందలించటంతో రాత్రి సమయంలో భార్యను గొంతు నులిమి చంపి మంగళవారం తెల్లవారుజామున స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త లొంగిపోయాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని శెవ పరీక్ష నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు