వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ న్యూశాయంపేట లోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్ జిల్లా డాక్టర్ సత్యశారద , హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు, ప్రజలు పాల్గోన్నారు.