రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొనే మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని రైతు భరోస నిధులను విడతల వారీగా కాకుండా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.