మూసీనదిలో లభించిన మృతదేహం కేసును అంబర్పేట పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులు జావేద్ (27), అమీరుల్ హాక్లను అరెస్టు చేశారు. బీహార్కు చెందిన ఇద్దరూ జావేద్ భార్యపై కన్నేశాడనే కోపంతో అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం తాగించి, వైరుతో ఉరివేసి చంపిన అనంతరం మృతదేహాన్ని మూసీనదిలో పడేశారని, దర్యాప్తు తర్వాత నిందితులను రిమాండు తరలించామని ఈస్ట్ జోన్ DCP బాలస్వామి తెలిపారు.