హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ట్రిపుల్ ఐటీ వెళ్లే మార్గంలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. మజీద్ బండ జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగలేదని అయితే కాస్త ట్రాఫిక్ జామవగా పోలీసులు వచ్చి క్లియర్ చేశారన్నారు. డ్రైవర్ చాకచక్యంతో బస్సును నడపడంతో పెను ప్రమాదం తప్పింది.