గుంటూరు జిల్లా మంగళగిరిలో గల జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ముందు గురువారం ఉదయం గ్రామ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మినిస్టర్ గారైన కొణిదల పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చామని అన్నారు. పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. సిబ్బంది అడ్డుకోవడంతో కార్యాలయం గేట్ ముందు నిరసన తెలియజేశారు.