చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలోని ఇందిరానగర్ లో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది.చెట్టుకు ఊరేసుకొని శ్రీ కౌసల్య అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.దీనిని గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వగా ఈపూరుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్తతో విభేదాల కారణంగా రెండేళ్ల నుంచి పుట్టింటిలోనే శ్రీ కౌసల్య ఉంటున్నట్లు సమాచారం.కేసు విచారణలో ఉంది.