పెద్ద పంజాణి: మండల ఎంపీడీవో కార్యాలయం నందు సర్వసభ్య సమావేశం సోమవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో రసాభాసగా ముగిసింది. ఎంపిపి రెడ్డెప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసీపీ సభ్యులు నిధుల దుర్వినియోగం అంటూ, సమావేశంలో ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేయడంతో టిడిపి వర్సెస్ వైసిపి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒకానొక దశలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అనంతరం ఎంపిడిఓ సమావేశాన్ని వాయిదా వేశారు.