బాపట్లలోని ఎరువుల దుకాణాలలో మంగళవారం పట్టణ సిఐ రాంబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఎరువుల వ్యాపారులు యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే సమాచారం మేరకు ఆయన సోదాలు జరిపారు.స్టాక్ నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా సిఐ రాంబాబు వ్యాపారులతో మాట్లాడుతూ యూరియా నిల్వల సమాచారాన్ని ప్రతిరోజూ షాపు ఎదుట నోటీసు బోర్డులో డిస్ప్లే చేయాలని ఆదేశించారు. అలాగే యూరియా కొనుగోళ్లకు సంబంధించిన బిల్లు బుక్కులు సక్రమంగా ఉండాలన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు