చర్ల మండల పరిధిలోని ముంజుంపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ లో ప్రమాదవశాత్తు నీటి సంపులో నలుగురు కార్మికులు పడ్డారు..ఊపిరాడక ఇద్దరు కార్మికులు మహేష్,తులసీరామ్ అక్కడికక్కడే మృతి చెందారు.. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు చర్ల హాస్పిటల్ కి తరలించారు.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో మరో కార్మికుడు ఈషా మృతి చెందాడు ఇంకొక కార్మికుడు పరిస్థితి విషమంగా ఉంది.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది