ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడటంతో వ్యక్తికి గాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని కోర్టు సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడటంతో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి.. గాయాలైన వ్యక్తి దుబ్బ గూడెం గ్రామానికి చెందిన అర్జున్ గా స్థానికుల గుర్తించారు.. ప్రమాదానికి గురైన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..