ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్న సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు ఆవులయ్య డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపడతారని ఆయన తెలిపారు.