ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లా, చింతకొమ్మదిన్నె మండల కేంద్రంలోని జెడ్పి హైస్కూల్ ఆవరణలో అధునాతన వసతులతో నిర్మించిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి.సెప్టెంబర్ 2న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. నూతన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ ను రాష్ట్ర మంత్రిచే ప్రారంభించేందుకు సన్నాహక ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు.