నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసమైన బాధిత శ్రీనివాస్ కుటుంబ సభ్యులను గురువారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఫోన్లో కలెక్టర్ మరియు హెచ్.పీ గ్యాస్ అధికారి మధుసూదన్ తో మాట్లాడి నష్టపరిహారం త్వరగా చెల్లించాలని ఇల్లు మంజూరు చేయాలని అన్నారు. 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎంపీ తోపాటు మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, మండల అధ్యక్షులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.