లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని DMHO జయ మనోరి హెచ్చరించారు. ఇవాళ నేరేడుచర్ల మాధవ నర్సింగ్ హోమ్లో DMHO బృందం ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా స్కానింగ్ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేయని స్కానింగ్ మిషన్ గుర్తించి నేరేడుచర్లలోని మాధవ నర్సింగ్ హోమ్ గల స్కానింగ్ మిషన్ గదిని సీజ్ చేసినట్లు తెలిపారు.