Download Now Banner

This browser does not support the video element.

రాపురు: సిద్ధ‌వ‌రం గ్రామం జాతీయ ర‌హ‌దారిపై అదుపు తప్పి లారీ బోల్తా, కింద పడిపోయిన యూరియా బ‌స్తాలు

Rapur, Sri Potti Sriramulu Nellore | Jan 31, 2025
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండ‌లం సిద్ధ‌వ‌రం గ్రామం జాతీయ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఏపీ 07 ఎక్స్ 1159 నెంబ‌రు గల లారీ కోవూరు నుంచి యూరియా బ‌స్తాల లోడుతో వెంక‌ట‌గిరి వైపు వెళుతోంది. ఈ క్ర‌మంలో శుక్రవారం సాయంత్రం లారీ అదుపు త‌ప్పి జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే పొద‌ల్లో బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో లారీలోని యూరియా బ‌స్తాల‌న్నీ కింద ప‌డిపోగా లారీ డ్రైవ‌ర్‌కి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఎవ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని విచార‌ణ చేప‌డుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us