నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామం లో దాదాపు రూ.300 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆయిల్ పామ్ కర్మగారాన్ని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. కర్మాగార ఆవరణ మొత్తం కలియతిరిగారు. ఆయిల్ ఫామ్ కర్మగార పనులు తుది దశకు చేరుకున్న మూలంగా యంత్రాలు నడిచే ప్రక్రియలో మొదటి దశ నుండి ఆయిల్ ఉత్పత్తి దశ మరియు క్రూడ్ ఆయిల్ తయారీ వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. కర్మాగార ఆవరణలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, పక్కన డ్రైనేజీ నిర్మాణ సైతం వేగంగా పూర్తి చేయాలని ఆయిల్ఫేడ్ అధికారులకు ఆదేశించారు. మిగతా ఫ్యాక్టరీ పనులు సైతం పూర్త