ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు: ఏడీఏ ఖాద్రి..ఎమ్మిగనూరు ADA ఖాద్రీ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ట్రేడర్ను తనిఖీ చేశారు. దుకాణంలో రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మాధవరం చెక్పోస్ట్ వద్ద నిన్నటి రోజు 105 బస్తాల ఎరువును బొలెరో వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ట్రేడర్స్ నుంచి వెళ్లిందని, దుకాణదారుడిపై 6ఏ కింద కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.